17 April, 2026 | 2:52 PM

Breaking News

డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •   సేవ చేయాలనే సంకల్పంతోనే రాజకీయాల్లోకి   •   వేములవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సర్వర్ డౌన్.. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు   •  

పోలీస్ స్టేషన్‌ను సందర్శించిన ఓఎస్డీ

07-02-2026 12:00 AM

గుండాల, ఫిబ్రవరి 6 (విజయక్రాంతి): మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ను ఓఎస్డీ నరేందర్ శుక్రవారం సందర్శించారు. స్టేషన్ పరిసరాలు, రికార్డులు, మల్కానా, స్టేషన్ డైరీ, పెండింగ్ కేసులు మరియు స్టేషన్ నిర్వహణ విధానాన్ని ఆయన పరిశీలించారు. సిబ్బందితో సమావేశమై వారి పనితీరును తెలుసుకుని, ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించాలని సూచనలు చేశారు.

ముఖ్యంగా కేసుల విషయంలో వేగవంతమైన దర్యాప్తు, స్టేషన్ శుభ్రత, రికార్డుల నిర్వహణ, ప్రజలతో సత్సంబంధాలు కలిగి ఉండాలని ఆదేశించారు. స్టేషన్లో అందుబాటులో ఉన్న సదుపాయాలు, భద్రతా చర్యలు, సిబ్బంది హాజరు తదితర విషయాలను ఆయన అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ హెచ్ ఓ సైదా రాఫూఫ్, సీఐ తిరుపతి, స్టేషన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.