23-02-2026 06:13:29 PM
జిల్లా కలెక్టర్ కె.హరిత
కుమ్రంభీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): పండుగలను మత సామరస్యంతో శాంతియుతంగా జరుపుకోవాలని జిల్లా కలెక్టర్ కె.హరిత అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కలెక్టరేట్ భవన సమావేశ మందిరంలో రంజాన్ పండుగ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) డేవిడ్, శిక్షణ ఐఎఫ్ఎస్ అధికారి భార్గవ్ కుమార్, ఆసిఫాబాద్ రాజస్వ మండల అధికారి లోకేశ్వర్ రావులతో కలిసి శాంతి కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రంజాన్ మాసమును ప్రజలు శాంతియుతంగా భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని తెలిపారు. మసీదుల వద్ద ప్రతిరోజూ పారిశుద్ధ్య పనులు చేపట్టాలని మున్సిపల్ కమిషనర్ ను ఆదేశించారు. ప్రార్థన సమయాలలో విద్యుత్ కోతలు లేకుండా నిరంతర సరఫరా ఉండేలా చర్యలు తీసుకోవాలని విద్యుత్ శాఖ ఎస్ ఈ ను ఆదేశించారు. మసీదుల వద్ద ట్రాఫిక్ సమస్యలు లేకుండా పోలీస్ శాఖ సమన్వయం చేసుకోవాలని తెలిపారు.
జిల్లాలో పండుగలను శాంతియుత వాతావరణంలో మతసామరస్యంతో జరుపుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ అధికారి నదీమ్, విద్యుత్తు శాఖ ఎస్ ఈ ఉత్తం జాడే, తహసిల్దార్లు రియాజ్, మధుకర్, మున్సిపల్ కమిషనర్ గజానన్, ఆసిఫాబాద్ మున్సిపల్ వైస్ చైర్మన్ మహమ్మద్ అహ్మద్, శాంతి కమిటీ సభ్యులు, మత పెద్దలు తదితరులు పాల్గొన్నారు.