calender_icon.png 21 January, 2026 | 6:12 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్మశాన వాటికకు దారి పరిశీలించిన రెవెన్యూ అధికారులు

21-01-2026 03:54:38 PM

నాగిరెడ్డిపేట్,(విజయక్రాంతి): మండలంలోని పెద్ద ఆత్మకూర్, చినాత్మకూర్ గ్రామాలకు స్మశాన వాటికకు దారి లేకపోవడంతో బుధవారం ఆర్ఐ.మహమ్మద్, మాజీ జెడ్పిటిసి ఉమ్మన్నగారి మనోహర్ రెడ్డి కలసి దారిని పరిశీలించారు. పెద్ద ఆత్మకూర్,చిన్న ఆత్మకూర్ గ్రామాల ప్రజలకు 'అంతిమ వీడ్కోలుకు అవస్థలే' పలుసార్లు రెండు గ్రామాల ప్రజలు ఉన్నత అధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పుడల్లా అధికారులు వచ్చి పరిశీలిస్తూ వెళ్లారు. రెండు రోజుల క్రితం చిన్న ఆత్మకూర్ గ్రామానికి చెందిన ఒక వ్యక్తి మరణించడంతో ఆయన అంతిమయాత్రకు దారి లేకపోవడంతో నాటు వేసిన పంట పొలాల నుండి అంతిమయాత్రను తీసుకెళ్లారు.

స్మశాన వాటికకు స్థలం ఉన్నప్పటికీ దారి లేకపోవడంతో రెండు గ్రామాల్లో ఎవరు చనిపోయిన ఇదే పరిస్థితి ఏర్పడుతుంది. దీనితో పలు పత్రికలో శీర్షికలు వార్తలు ప్రచురితమైనందున బుధవారం ఆర్ఐ.మహమ్మద్, మాజీ జెడ్పిటిసి ఉమన్నగారి మనోహర్ రెడ్డి స్మశాన వాటికకు దారిని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆర్ఐ.మమ్మద్ మాట్లాడుతూ... రెండు గ్రామాలకు స్మశాన వాటికకు స్థలము ఉంది కానీ దారి లేక ఇబ్బంది కావడం వాస్తవమేనని అయితే కొందరు రైతులు దారిని ఆక్రమించినట్లు తెలిపారు. ఆప్రాంతాన్ని పూర్తిగా సర్వే చేసి రెండు గ్రామాలకు దారిని ఇవ్వడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ అనిత లచ్చయ్య,తదితరులు ఉన్నారు.