calender_icon.png 8 May, 2025 | 12:19 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆక్రమణ భూములపై కలెక్టర్ కొరడా

07-05-2025 08:02:41 PM

జిల్లాలో 84 ఎకరాల ప్రభుత్వ భూమిని స్వాధీనం..

ఆక్రమదారులపై క్రిమినల్ చర్యలు..

నిర్మల్ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లాలో ప్రభుత్వ భూముల ఆక్రమణపై అనేక ఫిర్యాదులు రావడంతో జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్(District Collector Abhilasha Abhinav) కొరడా గెలిపించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో ప్రభుత్వ భూములను ఆక్రమించుకొని ప్లాట్లను చేయడం వ్యవసాయ పంట భూములను చేసుకొని కోట్లాది రూపాయల ప్రభుత్వ ఆస్తులను ఆక్రమించుకోవడంతో జిల్లా కలెక్టర్ ప్రత్యేక చొరవ తీసుకొని ఆక్రమణలపై చర్యలకు ఉపక్రమించారు. ప్రభుత్వ భూములను ఆక్రమించి అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్న వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా తెలిపారు. 

జిల్లాలో ఆక్రమణకు గురైన ప్రభుత్వ భూముల గుర్తింపు ప్రక్రియ కొనసాగుతుందని, పలు మండలాల్లో ఆక్రమణకు గురైన కోట్లాది రూపాయల విలువ చేసే ప్రభుత్వ భూములను గుర్తిస్తున్నామని తెలిపారు. ఇప్పటివరకు నాలుగు మండలాల్లో అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకొని కబ్జా చేసిన ప్రభుత్వ భూములను గుర్తించి స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. గత ఆరు నెలలుగా జిల్లాలోని వివిధ మండలాల్లో నిర్వహిస్తున్న ఆక్రమణల గుర్తింపు ప్రక్రియలో భాగంగా ఈ భూములు వెలుగులోకి వచ్చాయని తెలిపారు. నిర్మల్ గ్రామీణ మండలంలో 35.03 ఎకరాలు (రూ.5.77 కోట్లు), భైంసా మండలంలో 18.31 ఎకరాలు (రూ.2.07 కోట్లు), నర్సాపూర్(జి) మండలంలో 16 ఎకరాలు (రూ.2.04 కోట్లు), లోకేశ్వరం మండలంలో 12.25 ఎకరాలు (రూ.1.34 కోట్లు) మొత్తం 82 ఎకరాలు అన్యాక్రాంతం అయిన కోట్లాది విలువైన ప్రభుత్వ భూములను గుర్తించి స్వాధీనం చేసుకున్నామని కలెక్టర్ తెలిపారు.

ఆక్రమణదారులపై చట్ట ప్రకారం క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని, ప్రభుత్వ భూముల ఆక్రమణల గుర్తింపు ప్రక్రియ పలు మండలాలోని 260 ఎకరాలలో కొనసాగుతుందని తెలిపారు. జిల్లాలోని ప్రభుత్వ రెవెన్యూ, అటవీ భూములు, చెరువు శిఖం భూములు, సాగునీటి ప్రాజెక్టుల కాలువలు తదితర భూములను అక్రమంగా ఆక్రమించిన వారిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. జిల్లాలో ఈ ప్రక్రియ నిరంతరాయంగా కొనసాగిస్తామని, ప్రభుత్వ భూముల పరిరక్షణకు పటిష్ట చర్యలు తీసుకుంటామని కలెక్టర్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు.