07-05-2025 08:16:31 PM
మహబూబాబాద్ (విజయక్రాంతి): శ్రీ విశ్వవసు నామ సంవత్సరం వైశాఖమాసం వసంత రుతువు శుక్ల దశమి రోజున శ్రీమద్విరాట్ శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ఆరాధన మహోత్సవ వేడుకను మహబూబాబాద్ జిల్లా(Mahabubabad District) కేసముద్రం పట్టణంలోని శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా గణపతి పూజ, పుణ్యవచనం, పంచబ్రహ్మ ఆహ్వానం, బ్రహ్మంగారి పూజ, జీవ సమాధి, జండా ఆవిష్కరణ, మంగళ హారతి నిర్వహించి అన్న ప్రసాద వితరణ జరిగింది. ఈ కార్యక్రమంలో ఆలయ పూజారి భోజన పల్లి సత్యనారాయణ, మండల విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షులు రామడుగు వెంకటాచారి,తంగళ్ళపల్లి భాస్కరాచారి, బోగోజు వేణు గోపాల చారి, శ్రీరామోజు జగదీశ్వర చారి, ఆరెందుల ప్రభాకరాచారి, భక్తులు పాల్గొన్నారు.