calender_icon.png 8 May, 2025 | 12:47 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దేశ స్వతంత్రం, ఆదివాసీల హక్కుల కోసం పోరాడిన విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు

07-05-2025 07:59:04 PM

టిఏజిఎస్ జిల్లా కార్యదర్శి కారం పుల్లయ్య...

భద్రాచలం (విజయక్రాంతి): అల్లూరి సీతారామరాజు 101వ వర్ధంతి సందర్భంగా భద్రాచలం పట్నంలోనీ అంబేద్కర్ సెంటర్లో ఉన్న మన్యం వీరులు అల్లూరి సీతారామరాజు, గంటం దొర, మల్లు దొర విగ్రహాలకు ఆదివాసి గిరిజన సంఘం ఆధ్వర్యంలో పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం తెలంగాణ ఆదివాసి గిరిజన సంఘం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి కారం పుల్లయ్య మాట్లాడుతూ... అల్లూరి సీతారామరాజు దేశ స్వతంత్రం కోసం తెల్లదొరలను తరిమి కొట్టిన మహా గొప్ప విప్లవకారుడని ఆయన స్ఫూర్తితో భవిష్యత్తు ఆదివాసి హక్కుల కోసం పోరాటాలకు సిద్ధం కావాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.

అదేవిధంగా అల్లూరి సీతారామరాజుతో పాటు గంటందొర, మల్లు దొర కూడా అల్లూరి సీతారామరాజుతో పాటు స్వతంత్ర ఉద్యమంలో అదేవిధంగా గిరిజన హక్కుల కోసం పోరాటం చేసిన విప్లవ వీరులని గుర్తు చేశారు. రానున్న కాలంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గిరిజన హక్కులు చట్టాలను కాలరాస్తున్నటువంటి ఈ తరుణంలో ఆదివాసీలందరూ ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు తెలంగాణ ఆదివాసి గిరిజన సంఘం టౌన్ కార్యదర్శి కుంజా శ్రీను, నాయకులు చండ్ర భూపేందర్, కొర్స రవి, నవీన్ గణేష్, ప్రవీణ్ సుబ్బు జోగారావు ఇంకా తదితరులు పాల్గొన్నారు.