27 April, 2026 | 2:22 AM

జనగణన 2027 ‘స్వీయ నమోదు’ను ప్రారంభించిన కలెక్టర్

27-04-2026 12:45 AM

రంగారెడ్డి, ఏప్రిల్ 26(విజయక్రాంతి): భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జన గణన  2027లో భాగంగా, మొదటి దశ ‘ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన’ ప్రక్రియ ఆదివారం జిల్లాలో ప్రారంభమైంది. కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డి, అదనపు కలెక్టర్ కె. శ్రీనివాస్ మరియు డి.ఆర్.ఓ సంగీతలతో కలిసి దీనికి సంబంధించిన పోస్టర్ను ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ స్వయంగా ఆన్లైన్ పోర్టల్లో తన వివరాలను నమోదు చేసుకుని స్వీయ గణన (Self-Enumeration) ప్రక్రియను ప్రారంభించారు.ఏప్రిల్ 26 నుండి మే 10 వరకు వ్బుసైట్ https://se.census.గవర్నమెంట్ ఉదయం 6 గంటల నుండి రాత్రి 12 గంటల వరకు ఎప్పుడైనా నమోదు చేసుకోవచ్చు అన్నారు. జన గణన ప్రక్రియ రెండు దశల్లో జరుగుతుందని కలెక్టర్ వివరించారు.మొదటి దశ (మే 11 - జూన్ 9, 2026) ఇంటింటికి వచ్చి ఇండ్ల గణన చేపడతారు.

రెండవ దశ (ఫిబ్రవరి 9 - 28, 2027) జనాభా మరియు కుల గణన నిర్వహిస్తారు.పౌరులు తమ మొబైల్ లేదా కంప్యూటర్ ద్వారా పోర్టల్లో లాగిన్ అయ్యి, భాషను ఎంచుకుని, ఓటీపీ ద్వారా ధృవీకరణ చేసుకోవాలి. జియో-మ్యాపింగ్ ద్వారా ఇంటిని గుర్తించి, అడిగిన 31 ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాలి. ప్రక్రియ పూర్తయ్యాక వచ్చే SE Iౄని స్క్రీన్షాట్ తీసుకోవాలి. మే 11 తర్వాత ఇంటికి వచ్చే ఎన్యూమరేటర్కు ఈ ఐడీని చూపిస్తే సరిపోతుంది, తద్వారా సమయం ఆదా అవుతుంది.

జిల్లాలోని అధికారులు, ఉద్యోగులు, విద్యావంతులు మరియు ప్రజలందరూ బాధ్యతగా ఈ స్వీయ నమోదులో పాల్గొనాలి. మీరు అందించే సమాచారం అత్యంత గోప్యంగా ఉంచబడుతుంది. డిజిటల్ రూపంలో జరుగుతున్న ఈ ప్రక్రియలో భాగస్వాములై దేశ ప్రగతికి సహకరించాలి‘ అని కలెక్టర్ కోరారు.కార్యక్రమంలో జిల్లా సెన్సస్ ఇన్చార్జి శిరీష, ఎన్నికల విభాగం అధికారి వినోద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.