27 April, 2026 | 2:00 AM

మీ కలంకు ముగింపు లేదు... రాజకీయం శాశ్వతం కాదు

27-04-2026 12:43 AM

ప్రెస్ క్లబ్ సర్వసభ్య సమావేశంలో ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి

మహబూబ్ నగర్ ఏప్రిల్ 26 (విజయక్రాంతి): సమాజ శ్రేయస్సు కోసం జర్నలిస్టుల కలం కు ముగింపు లేదని రాజకీయం ఎప్పటికీ శాశ్వతం కాదని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని గ్రౌండ్ గార్డెన్లో ప్రెస్ క్లబ్ సర్వసభ సమావేశానికి హాజరైన ఎమ్మెల్యే జర్నలిస్టులను ఉద్దేశించి మాట్లాడారు. జర్నలిస్టుల సంఘాలు వేరైనా లక్ష్యం ఒకటే ఉండాలని, రెండు వేరువేరు దారుల్లో జర్నలిస్టు రాజకీయ నాయకులు ప్రయాణిస్తారని వారి లక్ష్యం మాత్రం ప్రజల మంచి కోసమే అన్నారు.

చేస్తున్న మంచిని ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత జర్నలిస్టులపై ఉందని తప్పులు జరిగితే కూడా వాడిని సరిచేపించే బాధ్యత కూడా జర్నలిస్టులకు ఉందని తెలిపారు. ఒంటరిగా రాజకీయాలకు వచ్చానని, గుంపుగా రాలేదన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సేవలు పొందుతున్న గర్భిణీ మహిళలకు యెన్నం హెల్త్ కిట్టులను పంపిణీ చేయడం జరిగిందని, వారికి ప్రైవేట్ ఆస్పత్రుల్లో కూడా ఓపీ ఉచితంగా చూస్తుండడం జరుగుతుందని తెలిపారు.

ఇప్పటికే 850 కిట్లను పంపిణీ చేయడం జరిగిందన్నారు. ప్రతి ఒక్కరికి మేలు చేయాలని ఉద్దేశంతో అడుగులు వేస్తున్నామని తెలిపారు. ప్రెస్ క్లబ్ కు ప్రింటర్, కంప్యూటర్ లను ఇప్పించడం జరుగుతుందన్నారు. ప్రతినెల జర్నలిస్టుల సంక్షేమ కోసం రూ లక్ష అందిస్తున్నామని, నేను పదవిలో ఉన్నంత వరకు ఇది కొనసాగుతుందన్నారు. ప్రస్తుత సమాజం లో రాజకీయ నాయకుల, జర్నలిస్ట్ ల విలువ తగ్గుతుందన్నారు. 

మంచిని మంచిగా చూపిస్తే చాలు : డిప్యూటీ మేయర్ మారేపల్లి సురేందర్ రెడ్డి 

 సమాజానికి మంచి చేయాలనే లక్ష్యంతో రాజకీయాల్లోకి వచ్చామని కుటుంబానికి దూరంగా ఉంటూ ఉదయం నుంచి రాత్రి వరకు ప్రజల సంక్షేమం కోసమే ఆలోచిస్తున్నామని మంచి మంచిగా చూపిస్తే చాలని నగర డిప్యూటీ మేయర్ మారేపల్లి సురేందర్ రెడ్డి అన్నారు. కొందరు కావాలనే రాద్ధాంతం చేస్తూ వార్తలు రాయడం సరికాదని, వాస్తవాలను నాయకుల ముందు ఉంచి ఆ సమస్యను పరిష్కరించే దిశగా ముందుకు తీసుకుపోవాల్సిన బాధ్యత జర్నలిస్టులపై ఉందన్నారు.

ఎవరైనా గాడి తప్పినట్టు జర్నలిస్టులు వివరిస్తే వారిని సక్రమమైన మార్గంగా తీసుకుపోయేందుకు ప్రెస్ క్లబ్ ఒక కమిటీ ఏర్పాటు చేసి అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. అనంతరం మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్,డిసిసి జిల్లా అధ్యక్షులు సంజీవ్ ముదిరాజ్, మాజీ మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్, టి పి సి సి కార్యదర్శి మిథున్ రెడ్డి లతో పాటు పలువురు నాయకులు మాట్లాడారు. అంతకుముందు ఎమ్మెల్యే హన్వాడ మండలంలో ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశ, హ్యాపీ సండే కార్యక్రమంలో పాల్గొన్నారు. 

ఈ కార్యక్రమం లో మూడ చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, సినియర్ న్యాయవాది బేక్కం జనార్దన్, ప్రెస్ క్లబ్ జిల్లా అధ్యక్షులు నరేందర్ చారి, కార్యదర్శి నరేంద్ర గౌడ్, కోశాధికారి పల్లెమోని యాదయ్య, ప్రెస్ క్లబ్ కార్యవర్గ సభ్యులు జర్నలిస్టులు అధిక సంఖ్యలో ఉన్నారు.