20 June, 2026 | 3:48 PM

Breaking News

పరేడ్ గ్రౌండ్స్‌లో అంతర్జాతీయ యోగా 24 గంట కౌంట్‌డౌన్ కార్యక్రమం   •   రైతు కుటుంబాన్ని పరామర్శించనున్న కేటీఆర్   •   హైదరాబాద్ రోడ్డుకి ట్రంప్ పేరు పెట్టడాన్ని నిరసిస్తూ నల్ల జెండాలతో ప్రదర్శన   •   'పది'లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు నగదు ప్రోత్సాహకం   •   జనపనార పైలెట్ ప్రాజెక్టు పై అవగాహన సదస్సు   •   23న రాష్ట్ర వ్యాప్త పాఠశాలల బంద్   •   అనురాగ్ లో 5రోజుల ఉపాధ్యాయ శిక్షణా తరగతులు ప్రారంభం   •   ఎస్‌ఐఆర్ విజయవంతానికి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి   •   కలెక్టర్ కోయ శ్రీహర్షను అభినందించి, సన్మానించిన ప్రభుత్వ విప్ విజయరమణ రావు   •   జ్యోతినగర్‌లో అభివృద్ధి పనులను ప్రారంభించిన కేంద్ర మంత్రి బండి   •  

పరిశ్రమ భద్రతపై కలెక్టర్ సమీక్ష

25-11-2025 12:00 AM

అశ్వాపురం, నవంబర్ 24 (విజయక్రాంతి): అశ్వాపురం మండలంలో భార జల కర్మాగారం ఆ్ఫు్సట్ ఎమర్జెన్సీపై సోమవారం నిర్వహించిన అత్యవసర సమావేశంలో జిల్లా కలెక్టర్ జితేష్ వి. పటేల్ కీలక సూచనలు చేశారు. కర్మాగారంలో సంభవించే విషవాయువు లీకేజీ వంటి అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు మాక్ డ్రిల్ నిర్వహించడం యాజమాన్యం తీసుకున్న మంచి చర్య అని ఆయన పేర్కొన్నారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కర్మాగారం పరిసర గ్రామాల ప్రజలకు అత్యవసర పరిస్థితుల్లో జరగబోయే ప్రమాదాలు, వాటి నివారణ మార్గాలపై పూర్తి అవగాహన ఉండాలని సూచించారు. ఆ్ఫు్సట్ ఎమర్జెన్సీ జోన్ పరిధిలోని గ్రామాల్లో మంచినీరు, రహదారి నిర్మాణం, విద్యా సదుపాయాలు, సేఫ్టీ షెల్టర్లు వంటి అత్యవసర మౌలిక వసతులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. అనంతరం అశ్వాపురం సీఐ అశోక్ రెడ్డి మాట్లాడుతూ, అత్యవసర పరిస్థితుల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ప్రజల భద్రతా చర్యలపై సూచనలుఅందించారు.