calender_icon.png 7 August, 2025 | 1:33 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను త్వరగా పూర్తి చేసుకోవాలి

05-08-2025 05:05:54 PM

రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక సహాయాన్ని సద్వినియోగం చేసుకోవాలి

జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

ఇందిరమ్మ ఇంటి నిర్మాణం పరిశీలన

కోనరావుపేట,(విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను లబ్ధిదారులు త్వరగా పూర్తి చేసుకోవాలని, రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక సహాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పిలుపునిచ్చారు.

కోనరావుపేట మండలంలో మర్తన్నపేట పరిధిలోని గొల్లపల్లి గ్రామంలో కలకుంట్ల రమణ నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇంటిని కలెక్టర్ మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఇంటిని త్వరితగతిన పూర్తి చేసుకుంటుండడంపై హర్షం వ్యక్తం చేశారు.రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక సహాయాన్ని సద్వినియోగం చేసు కుంటూ ఇంటిని 

పూర్తి చేయడంపై యజమానురాలని అభినందించినారు. ఇంటికి బేస్ మేట్, రూఫ్ లెవెల్ కింద ఇప్పటికే రూ. రెండు లక్షలు లబ్ధిదారు బ్యాంకు ఖాతాలో జమ అయ్యాయని వెల్లడించారు. ఆర్ సీ లెవెల్ పూర్తి అయినందున మూడవ చివరి చెల్లింపునకు చర్యలు తీసుకోవాలని హౌసింగ్ అధికారులను ఆదేశించారు.

తన భర్తకు కంటి సమస్య ఉందని, ఆదుకోవాలని రమణ కలెక్టర్ కు విన్నవించారు. రమణ భర్తకు సిరిసిల్ల పట్టణంలోని ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రిలో వైద్యం చేయించాలని అధికారులకు సూచించారు.