05-08-2025 05:03:07 PM
జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా
అగ్రహారం అంజన్న ఆలయం వద్ద పరిశీలన
వేములవాడ టౌన్,(విజయక్రాంతి): అంజన్న ఆలయంలో అభివృద్ధి పనులు మొదలు పెట్టాలని అధికారులను కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు. వేములవాడ మండలం అగ్రహారంలోని హనుమాన్ ఆలయం వద్ద రూ.31 లక్షలతో ఆర్చి, ప్రాకారం సాలహారంతో కలిసి, కమాన్ నిర్మాణానికి ఇటీవల శంకుస్థాపన జరిగింది.
ఈ సందర్భంగా కలెక్టర్ మంగళవారం ఆలయం వద్ద పరిశీలించి ఆలయ ఈవో శ్రీనివాస్ నకు, అధికారులకు పలు సూచనలు చేశారు. సిరిసిల్ల కరీంనగర్ ప్రధాన రహదారి మధ్య నుంచి 50 ఫీట్ల దూరం నుంచి ఆర్చి, ప్రాకారం సాలహారంతో కలిసి, కమాన్ నిర్మాణ పనులు ప్రారంభించాలని ఆదేశించారు. టెండర్ ప్రక్రియ ఇటీవల పూర్తి అయిందని వెల్లడించారు.