calender_icon.png 7 August, 2025 | 1:29 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జాడి పుష్ప దంపతులు లొంగిపోతే సహకరిస్తాం: సీఐ హనూక్

05-08-2025 05:10:29 PM

బెల్లంపల్లి,(విజయక్రాంతి): అడవుల్లో ఉండి మావోయిస్టులు సాధించేది ఏమి లేదని బెల్లంపల్లి రూరల్ సీఐ హలో హనూక్ అన్నారు. మంగళవారం బెల్లంపల్లి మండలంలోని చంద్రవెల్లి గ్రామంలో నుండి మావోయిస్టు పార్టీలో దండకారణంలో పనిచేస్తున్న దంపతులు జాడి పుష్ప, జాడి వెంకటి కుటుంబ సభ్యులను కలిసి మాట్లాడారు. ఈ సందర్భంగా జాడి పుష్ప తల్లి ఆవుల మల్లమ్మ, సోదరుడు ఆవుల గంగయ్యతో మాట్లాడారు.

మావోయిస్టు ఉద్యమాన్ని వీడి జాడి పుష్ప, జాడి వెంకటి దంపతులిద్దరూ ఇంటికి తిరిగివచ్చి ప్రభుత్వం ఎదుట లొంగిపోవాలని సూచించారు. వీరిద్దరూ లొంగిపోయి కుటుంబ సభ్యులతో హాయిగా ప్రశాంతమైన జీవితాన్ని గడపాలని సూచించారు. మావోయిస్టులు నింగి పోవడానికి తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తుందని తెలిపారు. వీరు లొంగిపోతే పోలీసుల నుండి ఎలాంటి ఇబ్బంది ఉండదని సీఐ హనూక్ చెప్పారు.