మెరుగైన వైద్య సేవలు
04-08-2026 03:31 PM
జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్
మల్లాపూర్,(విజయక్రాంతి): జిల్లా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడంతో పాటు అభివృద్ధి పనులను నిర్ణీత గడువులో నాణ్యతతో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ అధికారులను ఆదేశించారు. మంగళవారం మల్లాపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన ఆయన, ఓపీ, ఐపీ సేవలు, ఔషధ నిల్వలు, పరిశుభ్రతను పరిశీలించి సీజనల్ వ్యాధుల నివారణకు అవసరమైన మందులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంచాలని సూచించారు. అనంతరం పాత దామరాజపల్లి గ్రామంలో నిర్మాణంలో ఉన్న గ్రామపంచాయతీ భవనాన్ని పరిశీలించి పనులను గడువులోపు పూర్తి చేయాలని ఆదేశించారు. అలాగే వాల్గొండ గ్రామంలో రూ.మూడు కోట్ల అంచనా వ్యయంతో రహదారి, పుష్కర ఘాట్ల నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు.






