4 August, 2026 | 5:10 PM

ఊటూరు సహకార సంఘ అధ్యక్షునిగా ముద్దసాని

04-08-2026 03:34 PM

మానకొండూరు,(విజయక్రాంతి): కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం ఊటూరు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘ అధ్యక్షునిగా ముద్దసాని శ్రీనివాసరెడ్డి నియమితులయ్యారు. సంఘ అధ్యక్ష, పాలకవర్గ సభ్యులుగా మొత్తం 13 మందిని నియమిస్తూ ఏపీసి (సెక్రెటరీ టు గవర్నమెంట్) కే. సురేంద్ర మోహన్ ఈనెల 3న ఉత్తర్వులిచ్చారు.

బొంగోని కనుకయ్య, ఎడ్ల శ్రీధర్, మధునయ్య, కొమ్మగల్ల స్వరూప, మందల బక్కరెడ్డి, గోపు శ్రీనివాస్ రెడ్డి, కంకణాల భూమ్ రెడ్డి, అపురి ప్రేమలత, చింతకాయల రాజేశ్వరి, కనుకుంట్ల స్వామి, వేల్పుల రంగయ్య, తగరం మల్లేష్ లను పాలకవర్గ సభ్యులుగా ఖరారు చేసినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

ఆరు మాసాలు, లేదా సహకార సంఘానికి ఎన్నికలు జరిగేంత వరకు, లేదా ప్రభుత్వం నుండి తుది ఉత్తర్వులు వెలువడేంత వరకు వీరి నియామకం అమల్లో ఉంటుందని ఆ ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. బుధవారం లక్ష్మీపూర్ గ్రామంలోని సహకార సంఘంలో నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉంటుందని మానకొండూరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ద్యావ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.