calender_icon.png 7 February, 2026 | 7:59 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఈవీఎం గోదాములను పరిశీలించిన కలెక్టర్ సత్య శారద

07-02-2026 05:59:40 PM

వరంగల్,(విజయక్రాంతి): వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ యార్డ్ లో జిల్లా  గోదాములను  జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద శనివారం పరిశీలించారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ప్రతి  నెల నిర్వహించే సాధారణ తనిఖీలలో భాగంగా  ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ యార్డులోని జిల్లా ఈవీఎం గోదాములను  కలెక్టర్  తనిఖీ చేసి, ఈవీఎంలు భద్రపరిచిన  స్ట్రాంగ్ రూమ్ గోదాంలకు సంబంధించిన రికార్డులు, కట్టుదిట్టమైన భద్రత చర్యలు, సీసీ కెమెరాల నిరంతర పర్యవేక్షణ గురించి వివరాలను అధికారులను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. ఈ తనిఖీలో ఆదనవు కలెక్టర్ సంధ్యారాణి, తహసీల్దార్ శ్రీకాంత్, ఎన్నికల నాయబ్ తహసీల్దార్ రంజిత్,  తదితరులు పాల్గొన్నారు.