13-11-2025 02:41:12 PM
నాగర్ కర్నూల్, (విజయక్రాంతి): తెలకపల్లి మండలం చిన్నముద్దునూరు వినాయక కాటన్ మిల్‌లో సిసిఐ కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్, అధికారులు, రైతులతో చర్చించారు. స్లాట్ బుకింగ్ రోజునే కొనుగోలు పూర్తి చేయాలని, రైతులకు ఇబ్బందులు కలిగితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పత్తి కనీస మద్దతు ధర క్వింటాలుకు రూ.8,110గా నిర్ణయించబడిందని, తేమ శాతం 8–12% మధ్య ఉండాలని సూచించారు. రైతులు కపాస్ కిసాన్ యాప్ ద్వారా స్లాట్ బుకింగ్ చేసుకుని సులభంగా విక్రయం చేసుకోవచ్చని కలెక్టర్ తెలిపారు. పత్తి కొనుగోళ్ళ విషయంలో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదన్నారు.