13-11-2025 03:22:14 PM
ప్రజలకే జవాబుదారీగా ఉంటాం
హైదరాబాద్: ఖమ్మం జిల్లాలోని ముదిగొండ మండలం(Mudigonda Mandal) గంధసిరిలో శ్రీ సుందర మౌళీశ్వరస్వామి ఆలయ నిర్మాణ పనులకు ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క(Deputy Chief Minister Bhatti Vikramarka) శంకుస్థాపన చేశారు. రూ. 2 కోట్ల వ్యయంతో ఆలయాన్ని నిర్మిస్తున్నారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ... ప్రజలకే జవాబుదారీగా ఉంటామని తెలిపారు. విద్యుత్తు డిమాండ్ కు అనుగుణంగా కరెంట్ సరఫరా చేసే వ్యవస్థను నెలకొల్పామని పేర్కొన్నారు. కరెంటును రైతులకు ఉచితంగా ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వామేనని ఆయన పునరుద్ఘాటించారు. 200 యూనిట్లు ఉచిత విద్యుత్తు ఇస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వమే అన్నారు. ఎంత త్వరగా ఇందిరమ్మ ఇల్లు నిర్మించుకుంటే అంత వేగంగా బిల్లులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. ప్రతి పైసా ప్రజల అవసరాలకే ఖర్చు పెడతామని భరోసా కల్పించారు. ప్రజల సొమ్ము దోపిడీకి గురి కానివ్వమన్నారు. ఎక్కడ ఉన్నా ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తామని హామీ ఇచ్చారు. మధిర ప్రజలు వేసిన ప్రతి ఓటుకు గౌరవం తీసుకువస్తానని భట్టి విక్రమార్క తేల్చిచెప్పారు.