6 August, 2026 | 3:15 AM

భక్తులకు మెరుగైన సదుపాయాలు కల్పించాలి

06-08-2026 02:06 AM

*జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ 

*కొడవటంచలో లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకున్న కలెక్టర్ 

*స్వామివారికి ప్రత్యేక పూజలు

భూపాలపల్లి/ రేగొండ, ఆగస్టు 05 (విజయక్రాంతి): స్వామి వారిని దర్శించు కునేందుకు వచ్చే భక్తులకు మెరుగైన సదుపాయాలు కల్పించాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ అన్నారు. బుధవారం: శ్రీ లక్ష్మీనరసింహ స్వామిని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ దర్శించుకున్నారు ఆలయానికి చేరుకున్న కలెక్టర్కు దేవస్థానం అధికారులు, పూజారులు ఆలయ సాంప్రదాయం ప్రకారం ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కలెక్టర్ స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

పూజా కార్యక్రమాల అనంతరం ఆలయ అర్చకులు స్వామివారి శేషవస్త్రాలు, తీర్థప్రసాదాలను కలెక్టర్కు అందజేసి వేదాశీర్వచనం చేశారు.ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో జరుగుతున్న అభివృద్ధి పనులను కలెక్టర్ పరిశీలించారు. నిర్మాణంలో ఉన్న ప్రధాన ఆర్చ్ పనులు, అతిథి గృహాన్ని తనిఖీ చేశారు. రోజూ ఆలయానికి వచ్చే భక్తుల సంఖ్య, వారికి అందిస్తున్న వసతి సదుపాయాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు.

ఆలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా దర్శనం సజావుగా సాగేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. భక్తుల వసతులు, మౌలిక సదుపాయాల కల్పనలో నిర్లక్ష్యం వహించవద్దని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో దేవస్థాన కార్యనిర్వహణ అధికారి శ్రీనివాస్, ఎంపిడిఓ వేంకటేశ్వర్లు, నాయబ్ తహసీల్దార్ రజాక్, పూజారులు తదితరులు పాల్గొన్నారు.