15 April, 2026 | 12:38 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

స్వయంభు శ్రీ రామలింగేశ్వరస్వామి దేవాలయంను దర్శించుకున్న కలెక్టర్

25-06-2025 09:47 PM

ఖమ్మం (విజయక్రాంతి): చింతకాని మండల పర్యటనలో భాగంగా బుధవారం కలెక్టర్ అనుదీప్ దూరిశెట్టి(Collector Anudeep Durishetty) వందనం గ్రామంలోని స్వయంభు శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయంను దర్శించుకున్నారు. ఆలయంలో స్వామికి ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ పండితులు ఆశ్వీరాదం ఇచ్చి స్వామివారి శేషవస్త్రం, తీర్ధాప్రసాదాలు కలెక్టర్ కు అందించారు. 

వందనం గ్రామంలోని నర్సరీని సందర్శించి మొక్కలను పరిశీలించిన జిల్లా కలెక్టర్ కలెక్టర్ అనుదీప్ వందనం గ్రామంలోని నర్సరీని సందర్శించి, నర్సరీ అంతా కలియతిరిగి మొక్కలను పరిశీలించారు. జిల్లాలో వన మహోత్సవంలో భాగంగా నిర్దేశిత లక్ష్యం మేరకు మొక్కలు నాటేందుకు ప్రతి గ్రామంలో వన నర్సరీల ద్వారా మొక్కలు పెంచి అదే గ్రామంలో నాటించడానికి ఏర్పాట్లు చేయాలని, మొక్కల సంరక్షణకు చేయాల్సిన కార్యచరణ సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో సిద్ధం చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డిఆర్డీవో సన్యాసయ్య, చింతకాని ఎంపీడివో సంబంధిత  అధికారులు, తదితరులు పాల్గొన్నారు.