సాయుధ దళాల దినోత్సవం సందర్భంగా పతాక నిధికి కలెక్టర్ తొలి విరాళం
భద్రాద్రి కొత్తగూడెం, డిసెంబర్ 5, (విజయక్రాంతి):జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ శుక్రవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన సాయుధ దళాల దినోత్సవ పతాక నిధి కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ తొలి విరాళాన్ని అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ రక్షణలో అహర్నిశలు శ్రమిస్తున్న సైనికుల కోసం పతాక నిధికి ప్రతి పౌరుడు తన వంతు సహకారం అందించడం దేశభక్తి, సామా జిక బాధ్యతకు ప్రతీక అని తెలిపారు.
కలెక్టర్ జితేష్ వి. పాటిల్ మాట్లాడుతూ సరిహద్దుల్లో ప్రతికూల పరిస్థి తుల్లో సేవలు అందిస్తున్న భారత సై న్యం, నౌకాదళం, వాయుసేన సిబ్బం ది త్యాగాలను ప్రతి భారతీయుడు గౌరవించాలని అన్నారు. వీరి కుటుంబాల సంక్షేమం కోసం పతాక నిధి వినియోగించబడుతుందని పేర్కొంటూ జిల్లా ప్రజలు, విద్యాసంస్థలు, పారిశ్రామిక వర్గాలు, వ్యాపారవేత్తలు, స్వచ్ఛంద సంస్థలు ఈ కార్యక్రమంలో పాల్గొని విరాళాలు అందించాలని పిలుపు నిచ్చారు.
దేశం కోసం ప్రాణత్యాగం చేసిన వీరజవాన్ల కుటుంబాల పట్ల సమాజం అవగాహన పెంపొందించుకోవాల్సిన అవసరం ఉందని కలెక్టర్ అన్నారు. పతాక నిధి ద్వారా వీరమరణం పొందిన సైనికుల కుటుంబాలకు, సేవలలో గాయపడిన రక్షణ సిబ్బందికి ఆర్థిక సహాయం అందించబడుతుందని వివరించారు. ప్రతి సంవత్సరం సాయుధ దళాల దినోత్సవం సందర్భంగా ఈ నిధి సేకరణ ద్వారా దేశ రక్షణ వ్యవస్థ పట్ల ప్రజల సమగ్రత, ఐక్యత మరింత బలపడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా సైనిక వెల్ఫేర్ అధికారి ఎం చంద్రశేఖర్, వింగ్ కమాండర్ రిటైర్డ్ సురేందర్, ఆర్మీ రిటైర్డ్ సుభాని, కృష్ణమూర్తి, అరుణ్ తదితరులు పాల్గొన్నారు.






