04-12-2025 12:05:47 AM
నిర్మల్, డిసెంబర్ 3 (విజయక్రాంతి): రంగారెడ్డి జిల్లాలో నిర్వహించిన ‘మహా కిసాన్ మేళా’లో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చేతుల మీదుగా రైతు రత్న అవార్డును జిల్లాకు చెందిన రైతు అందుకున్నారు.
నిర్మల్ మండలం తలువేద గ్రామా నికి చెందిన కోమటి బుచ్చన్న పకృతి వ్యవసా యం సేంద్రీయ వ్యవసాయ విధానం ద్వారా దేశీయ వంగడాలను పండించడంతో ఈ అవార్డు దక్కినట్టు తెలిపారు. రైతుతో పాటు మండల వ్యవసాయ శాఖ అధికారి వసంతరావు ఏఈఓ అంబాజీ ఉన్నారు.