నాకౌట్ స్టేజ్‌కు కొలంబియా
25-06-2026 12:00 AM
ఎస్టాడియా, జూన్ 24 : ఫిఫా వరల్డ్‌కప్ లో కొలంబియా నాకౌట్‌కు చేరుకుంది. ఆసక్తికరంగా సాగిన పోరులో ఆ జట్టు 1 స్కోరుతో డీఆర్ కాంగోపై విజయం సాధించింది. మ్యాచ్ ఆద్యంతం కొలంబియా ఆధిపత్యం కనబరిచినా కాంగో గోల్‌కీపర్ తన జట్టును చాలాసేపు పోరాడేలా చేశాడు.
కొలంబియా దాడులను సమర్థవంతంగా అ డ్డుకుని దాదాపుగా మ్యాచ్‌ను డ్రాగా ముగించేందుకు చివరివరకూ పోరాడాడు. అయితే 76వ నిమిషంలో కొలంబియా గోల్ కొట్టిం ది. మువోజ్ పెనాల్టీ ఏరియాలోకి దూసుకెళ్లి గోల్‌గా మలిచాడు. ఫలితంగా 1 ఆధిక్యం లో నిలిచింది. తర్వాత కాంగో స్కోరు సమం చేసేందుకు చివరి వరకూ తీవ్రంగా ప్రయత్నించినా కొలంబియా డిఫెన్స్ అడ్డుకుంది. వరుసగా రెండు విజయాలతో కొలంబియా నాకౌట్ రౌండ్‌లో అడుగుపెట్టింది.






