శతక్కొట్టిన హర్షిత్ చౌదరి
25-06-2026 12:00 AM
వరంగల్ వారియర్స్ బోణి
హైదరాబాద్, జూన్ 24 : తెలంగాణ టీ20 లీగ్-లో సెంచరీల మోత మోగుతోంది. తాజాగావరంగల్ వారియర్స్ ఓపెనర్ హర్షిత్ చౌదరి శతక్కొట్టాడు. ఖమ్మం ఏసెస్‌తో జరిగిన మ్యా చ్‌లో హర్షిత్ 48 బం తుల్లో వంద పరుగుల మార్కు అందుకున్నాడు. అతడి ఇన్నింగ్స్‌లో 9 ఫోర్లు, 6 సిక్సర్లున్నాయి. ఈ మ్యా చ్‌లో మొదట బ్యాటింగ్‌కు దిగిన ఖమ్మం 19.2 ఓవర్లలో 202 పరుగులకు ఆలౌటైంది. ఖమ్మం బ్యాటర్లలో మయాంక్ గుప్త (54), మికిల్ జైస్వాల్ (54) హాఫ్ సెంచరీలతో రాణించారు. తర్వాత ఛేజింగ్‌లో ఓపెనర్ అమన్‌రావు వికెట్ కో ల్పోగా.. మరో ఓపెనర్ హర్షిత్ చౌదరి శతకంతో చెలరేగాడు. 62 బంతుల్లో హర్షిత్ ౧౧ ఫోర్లు, ౭ సిక్సర్లతో 121 పరుగులు చేశాడు. ఫలితంగా 18.5 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది.






