calender_icon.png 14 January, 2026 | 6:26 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆకట్టుకున్న సనాతన ధర్మం-మన జీవన మార్గం ముగ్గు

14-01-2026 03:56:48 PM

పబ్బతి నితారెడ్డిని అభినందించిన కాలనీవాసులు

సుల్తానాబాద్,(విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని గాంధీనగర్ లో  సామాజిక కార్యకర్త పబ్బతి నీతారెడ్డి సంక్రాంతి పండుగను పురస్కరించుకొని  వేసిన సనాతన ధర్మం... మన జీవన మార్గం, రంగురంగుల ముగ్గు కాలనీవాసులను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ సందర్భంగా నీతారెడ్డి మాట్లాడుతూ... ఈ  ముగ్గులో సనాతన ధర్మం సంపూర్ణ భావాన్ని చూపించాలనుకున్నానని, మధ్యలో ఉన్న ధ్యానం చేస్తున్న వ్యక్తిమన అంతర్ముఖ ప్రయాణాన్ని, ఆత్మశాంతిని సూచిస్తాడు. ఓం సృష్టికి మూలమైన ప్రణవ నాదం.ఇది మన మనస్సును ఏకాగ్రం చేసి పరమాత్మతో అనుసంధానం చేస్తుంది.స్వస్తిక్ శుభం, మంగళం, సమతుల్యతకు ప్రతీక.

మన జీవితం ధర్మ మార్గంలో సాగాలని ఇది సూచిస్తుంది.గుడి (దేవాలయం)దేవుడు కేవలం ఆలయంలోనే కాదు,మన హృదయంలో కూడా ఉన్నాడన్న భావాన్ని తెలియజేస్తుందన్నారు, తామర పువ్వుమురికిలో పుట్టినా కలుషితం కాకుండా వికసిస్తుంది.అలాగే మనం కూడా ప్రపంచంలో ఉండిఆసక్తులు, ఆవేశాల నుంచి దూరంగాపవిత్రంగా, ధర్మబద్ధంగా జీవించాలన్న సందేశాన్ని ఇస్తుంది. ఈ ముగ్గు ద్వారాధ్యానం, భక్తి, పవిత్రత, ధర్మంఅన్నీ కలిస్తే శాంతియుతమైన జీవితం సాధ్యమవుతుందని చూపించడం జరిగిందన్నారు, ఒక్క ముగ్గు ఇన్నివిషయాలను తెలియజేయడం అభినందనీయం అంటూ  కాలనీవాసులు  సామాజిక కార్యకర్త పబ్బతి నితారెడ్డి నీ అభినందించారు.