14-01-2026 03:52:46 PM
నూతనకల్,(విజయక్రాంతి): మండల వ్యాప్తంగా బుధవారం సంక్రాంతి సంబరాలు భోగి వేడుకలతో వైభవంగా ప్రారంభమయ్యాయి.మండలంలోని ఆయా గ్రామాల్లో ప్రజలు ఉత్సాహంగా ఈ వేడుకల్లో పాల్గొన్నారు.పండుగను పురస్కరించుకుని తెల్లవారుజాము నుంచే ప్రజలు తమ ఇళ్ల ముందు భోగి మంటలు వేశారు. పాత వస్తువులను మంటల్లో వేస్తూ, తమ కష్టాలన్నీ తొలగిపోయి సుఖసంతోషాలు కలగాలని అగ్నిదేవుడిని ప్రార్థించారు. ప్రతి ఇంటి ముంగిట మహిళలు రంగు రంగుల ముగ్గులు వేసి పండుగ వాతావరణాన్ని తీసుకువచ్చారు. చిన్నలు, పెద్దలు అనే తేడా లేకుండా అందరూ గాలిపటాలు ఎగురవేస్తూ సందడి చేశారు.గ్రామాల్లో ఎక్కడ చూసినా పండుగ కళ ఉట్టిపడింది. ఈ వేడుకల్లో ఆయా గ్రామాల సర్పంచులు, స్థానిక ప్రజాప్రతినిధులు మరియు గ్రామస్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.