11 April, 2026 | 11:08 PM

మేడ్చల్ ఎమ్మెల్యేలను కలిసిన నవోదయ కాలనీ వాసులు

11-04-2026 10:01 PM

మేడ్చల్ అర్బన్,(విజయక్రాంతి): మేడ్చల్ నియోజకవర్గం శాసన సభ్యులు మాజీ మంత్రివర్యులు చామకూర మల్లారెడ్డిని  మేడ్చల్ కార్పొరేషన్ 297 వ డివిజన్ లోని నవోదయ కాలనీ వాసులు కలిసి శాలువాతో సత్కరించి పూల బోకే అందించి కాలనీలోని నెలకొన్న సమస్యలపై వినతిపత్రం అందజేసినట్లు కాలనీ అధ్యక్షులు సీతారాం తెలిపారు. మేడ్చల్ కార్పొరేషన్ మున్సిపల్ పట్టణంలోని నవోదయ కాలనీలో నెలకొన్న సమస్యలపై దృష్టి సారించి తొందరలోనే సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే మల్లారెడ్డి హామీ ఇచ్చినట్లు జిల్లా గ్రంథాలయం మాజీ చైర్మన్ బి భాస్కర్ యాదవ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో నవోదయ కాలనీ ప్రధాన కార్యదర్శి పవన్ కుమార్.కోశాధికారి శేఖర్ గుప్తా లతోపాటు కాలనీవాసులు పాల్గొన్నారు.