అగ్నిప్రమాదంలో మొక్కజొన్న దగ్ధం
11-04-2026 09:58 PM
కుబీర్,(విజయక్రాంతి): మండలంలోని చాత గ్రామానికి చెందిన రైతు సాయినాథ్ కు చెందిన మొక్కజొన్న పంట అగ్ని ప్రమాదంలో శనివారం కాలిపోయినట్టు రైతు తెలిపారు. పంట చేన్లో రెండు ఎకరాల మొక్కజొన్నలు కోసి ఆరబెడుతుండగా శనివారం ఒక్కసారిగా మంటలు రావడంతో దాన్ని ఆర్పేందుకు రైతులు ప్రయత్నించారు. అయితే పంట మొత్తం కాలిపోయటంతో లక్ష రూపాయల వరకు నష్టం జరిగినట్టు రైతు సాయినాథ్ తెలిపారు. పంటపొలాని వ్యవసాయ శాఖ అధికారులు సందర్శించి వివరాలు తెలుసుకున్నారు.




