calender_icon.png 23 January, 2026 | 3:00 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అలయ్ బలయ్‌కి రండి

20-09-2024 01:21:01 AM

స్పీకర్ గడ్డం ప్రసాద్‌కు దత్తాత్రేయ ఆహ్వానం

హైదరాబాద్, సెప్టెంబర్ 19 (విజయక్రాంతి): దసరా పండుగ తర్వాత అక్టోబర్ 13న హైదరాబాద్‌లో నిర్వహించే అలయ్ బలయ్ కార్యక్రమానికి రావాలని అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్‌ను హర్యానా గవర్నర్ ఆహ్వానించారు. గురువారం జూబ్లీహిల్స్‌లోని స్పీకర్ నివాసానికి గవర్నర్ దత్తాత్రేయ, ఆయన కూతురుతో కలిసి వెళ్లి కార్యక్రమానికి రావాల్సిందిగా కోరారు. ఏటా దసరా పండుగ మరుసటి రోజు అలయ్ బలయ్ కార్యక్రమాన్ని దత్తాత్రేయ నిర్వహిస్తుంటారు. ఆయన గవర్నర్‌గా వెళ్లాక, ఈ కార్యక్రమాన్ని కూతరు విజయలక్ష్మి నిర్వహిస్తున్నారు.