20-09-2024 01:21:44 AM
హైదరాబాద్, సెప్టెంబర్ 19 (విజయక్రాంతి): రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టిన రాణి కుముదిని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను గురువారం రాజ్‌భవన్‌లో మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చర్చించారు. విజిలెన్స్ కమిషన్‌గా బాధ్యతలు స్వీకరించిన ఎంజీ గోపాల్ సైతం గవర్నర్ కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు.