calender_icon.png 23 January, 2026 | 7:07 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భాగీర్తపల్లిలో ఓటరు దినోత్సవం సందర్భంగా అవగాహన కార్యక్రమం

23-01-2026 01:29:17 PM

భిక్కనూర్, జనవరి 23(విజయ క్రాంతి): కామారెడ్డి జిల్లా భిక్కనూర్ మండలం భాగీర్తపల్లి గ్రామంలోని జెడ్ పి హెచ్ ఎస్ పాఠశాలలో జాతీయ ఓటరు దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. గ్రామ సర్పంచ్ గంగయ్యగారి నర్సింలు ఆధ్వర్యంలో విద్యార్థులతో కులం, మతం వంటి విభేదాలకు అతీతంగా నిష్పక్షపాతంగా ఓటు వేయాలనే ప్రతిజ్ఞ చేయించారు.ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ వడ్ల స్వామి, వార్డు సభ్యుడు గోండ్ర రాజు, పంచాయతీ కార్యదర్శి, జీపీవో, బీఎల్‌వో, ఉపాధ్యాయులు పాల్గొని ప్రజాస్వామ్య విలువల ప్రాధాన్యతను వివరించారు.