31 July, 2026 | 4:00 AM

లష్కర్ బోనాల ఉత్సవాలకు రండి

31-07-2026 02:16 AM

గవర్నర్ శివప్రతాప్ శుక్లాను ఆహ్వానించిన మంత్రి సురేఖ 

సికింద్రాబాద్, జూలై30 (విజయక్రాంతి): రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్లాని అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ బుధవారం లోక్ భవన్‌లో మర్యాద పూర్వకంగా కలిసారు. సికింద్రాబాద్‌లో ఆగస్టు 2,3వ తేదీలలో నిర్వహించనున్న శ్రీఉజ్జయిని మహంకాళి ఆషాఢ బోనాల (లష్కర్ బోనాలు)

ఉత్సవాలకు రావాల్సిందిగా గవర్నర్ శివప్రతాప్ శుక్లాని మంత్రి కొండా సురేఖ ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ డైరెక్టర్ హనుమంతరావు, ఉజ్జయిని మహంకాళి దేవస్థానం ఈవో, అసిస్టెంట్ కమిషనర్ మనోహర్ రెడ్డి,ఆలయ అర్చకులు తదితరులు పాల్గొన్నారు.