అత్తతో వాగ్వాదం.. వివాహిత ఆత్మహత్య
అచ్చంపేట, జూలై 30: అత్తతో కుటుంబ విషయంపై జరిగిన వాగ్వాదంతో మనస్తాపానికి గురైన ఓ వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన అచ్చంపేట మండలం బొమ్మనపల్లి గ్రామంలో గురువారం చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. పదర గ్రామానికి చెందిన జల్లెల మంజుల (25)కు బొమ్మన్పల్లికి చెందిన మహేష్తో ఐదేళ్ల క్రితం వివాహమైంది.
వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. గురువారం ఉదయం కుటుంబ విషయంపై మంజులకు అత్త లక్ష్మమ్మతో వాగ్వాదం జరిగింది. అనంతరం మనస్తాపానికి గురైన మంజుల ఇంట్లో ఫ్యాన్కు చీరతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. భర్త మహేష్ సమాచారం ఇవ్వడం తో కుటుంబ సభ్యులు ఆమెను అచ్చంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు సిద్దాపూర్ ఎస్‌ఐ సి. అంజయ్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.






