25 June, 2026 | 2:33 AM

ఆరు నూరైనా కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి కావడం ఖాయం

25-06-2026 01:58 AM

మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి

వనపర్తి మండలం, జూన్ 24: బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి కావడం ఖాయమని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. బుధవారం జిల్లా పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు గట్టు యాదవ్ అధ్యక్షతన నిర్వహించిన బూత్ లెవెల్ ఏజెంట్ల శిక్షణ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఓటర్ల సవరణ ప్రక్రియలో బూత్ లెవెల్ ఏజెంట్లు కీలక పాత్ర పోషించాలని ఆయన సూచించారు. ‘సర్‘ ప్రక్రియను నాయకులు,

కార్యకర్తలు ప్రతిష్టాత్మకంగా తీసుకుని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అర్హులైన ఓటర్ల హక్కులను కాపాడడంతో పాటు ప్రజా సమస్యలను గుర్తించి పార్టీ దృష్టికి తీసుకురావాలన్నారు. అనంతరం రాష్ట్ర కార్యదర్శి మెట్టు శ్రీనివాస్ మాట్లాడుతూ బూత్ లెవెల్ ఏజెంట్లు పార్టీ సైనికులుగా పనిచేయాలని అన్నారు. ఓటర్ల జాబితా సవరణలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.