25 June, 2026 | 3:02 AM

ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు సర్పంచ్ ఉదారత

25-06-2026 01:59 AM

అలంపూర్ జూన్ 24 :  ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల విద్యాభివృద్ధి కోసం కలుగోట్ల గ్రామ సర్పంచ్ ఆర్ వి శేషు బుధవారం నోట్బుక్స్, వాటర్ బాటిల్స్ను విద్యార్థులకు పంపిణీ చేశారు. తన తండ్రి స్వర్గీయ ఆర్.వి. రాముడు జ్ఞాపకార్థంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో విద్యార్థులకు డబుల్ రూల్, సింగిల్ లైన్, బార్డర్ లైన్ నోట్బుక్స్ అందజేశారు. అలాగే విద్యా ప్రమాణాల మెరుగుదలకు తన సొంత ఖర్చుతో ఒక పీఈటీ టీచర్, ఒక మ్యాథ్స్-ఇంగ్లిష్ టీచర్ను పాఠశాలలో ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు విద్యతో పాటు నైపుణ్యాల్లోనూ ముందుండాలనే లక్ష్యంతో పాఠశాల అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్న సర్పంచ్ శేషును గ్రామ ప్రజలు అభినందించారు. ఈ కార్యక్రమంలో మాజీ సింగిల్ విండో చైర్మన్ మహేశ్వర్ రెడ్డి, గ్రామపంచాయతీ కార్యదర్శి ధనుంజయ రెడ్డి, హెడ్మాస్టర్ కాశీశ్వర్, ఉపాధ్యాయులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.