14 July, 2026 | 7:21 PM

Breaking News

ఇంటింటి సర్వైతో ఖచ్చితమైన ఓటరు జాబితా   •   ప్రతి పౌరుడు సర్ కార్యక్రమంలో భాగస్వాములు కావాలి   •   విద్యార్థుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం: గోగుల సరిత   •   ఏకగ్రీవంగా మేడిపల్లి మండల పీఆర్టియుటీఎస్ నూతన కార్యవర్గం ఎన్నిక   •   చొప్పరి సదానందం కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి శ్రీధర్ బాబు పీఏ   •   మంథనికి సింగరేణి మెడికల్, మైనింగ్ కళాశాలలు మంజూరు చేయాలి   •   ఆసుపత్రి తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్   •   వారం తిరగక ముందే మళ్లీ కోతుల బీభత్సం   •   పెచ్చులూడుతున్న పాఠశాల భవనం.. భయాందోళనలో విద్యార్థులు   •   ప్రజా భద్రత, ట్రాఫిక్ నిబంధనల అమలుకై సబ్-ఇన్‌స్పెక్టర్ ఆధ్వర్యంలో ముమ్మర వాహన తనిఖీలు   •  

పోలీస్ అమరవీరుల సంస్మరనార్ధం.. సైకిల్ ర్యాలీ

25-10-2024 01:38 PM

కమీషనరేట్ పోలీసు హెడ్ క్వార్టర్స్ నుండి సైకిల్ ర్యాలీ ప్రారంభించిన కరీంనగర్ పోలీసు కమీషనర్ అభిషేక్ మొహంతి ఐపిఎస్

కరీంనగర్ (విజయక్రాంతి): పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాలలో భాగంగా శుక్రవారం నాడు కరీంనగర్ పోలీసు కమీషనరేట్ హెడ్ క్వార్టర్స్ నుండి సైకిల్ ర్యాలీ కార్యక్రమం నిర్వహించామని కరీంనగర్ పోలీస్ కమీషనర్ అభిషేక్ మొహంతి తెలిపారు. విధి నిర్వహణలో ప్రాణాలను కోల్పోయిన పోలీసు అమరవీరులను స్మరిస్తూ, సమాజంలో శాంతిభద్రతల స్థాపనకు పోలీసులు చేస్తున్న కృషి పట్ల ప్రజలకు అవగాహన కలిగే విధంగా ఈ సైకిల్ ర్యాలీ ఉపయోగపడుతుందని భావిస్తున్నామన్నారు. కమీషనరేట్ లోని అన్ని విభాగాలకు చెందిన పోలీసు అధికారులతో పాటు నగరంలోని పలువురు సభ్యులు పెద్దసంఖ్యలో ఈ ర్యాలీలో పాల్గొన్నారన్నారు.

పోలీస్ హెడ్ క్వార్టర్స్ నుండి ప్రారంభమైన ఈ ర్యాలీ బస్ స్టాండ్ ఇన్ గేట్, ఇందిరా చౌక్, రాంనగర్ పాత లేబర్ అడ్డా మీదుగా, శివ థియేటర్ జంక్షన్, కెమిస్ట్రీ భవన్ మీదుగా, కోర్టు చౌరస్తా, మంచిర్యాల చౌరస్తా, గాంధీ చౌరస్తా, టవర్ సర్కిల్, శాస్త్రి రోడ్, త్రీ టౌన్ మీదుగా కమాన్ చౌరస్తా, వన్ టౌన్ పోలీసు స్టేషన్ తిరిగి బస్ స్టాండ్ మీదుగా పోలీసు హెడ్ క్వార్టర్స్ వద్ద ముగిసింది. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ (ఏఆర్) అనోక్ జయ్ కుమార్ లతో పాటు ఏసీపీలు విజయ్ కుమార్, మాధవి, నరేందర్, వెంకటరమణ, కమిషనరేట్ లోని ఇన్స్పెక్టర్లు కోటేశ్వర్, విజయకుమార్, జాన్ రెడ్డి, స్వామి, ప్రకాష్ గౌడ్, రిజర్వు ఇన్స్పెక్టర్లు రజినీకాంత్, కుమార స్వామి, జానీమియా, శ్రీధర్ రెడ్డి, సురేష్ మరియు ఇతర అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.