calender_icon.png 2 January, 2026 | 5:34 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వాణిజ్య సిలిండర్‌పై రూ.111పెంపు!

02-01-2026 12:00:00 AM

నూతన సంవత్సరంలో చమురు కంపెనీల షాక్

న్యూఢిల్లీ, జనవరి 1: నూతన సంవత్సరంలో దేశీయ హోటళ్లు, రెస్టారెంట్లు, సర్వీస్ ఆపరేటర్లకు చమురు కంపెనీలు షాక్ ఇచ్చాయి. 19 కిలోల వాణిజ్య సిలిండర్ ధరను రూ.111 పెంచాయి. అయితే, ఈ పెరుగుదల గృహ అవసరాలకు వినియోగించే గ్యాస్ సిలిండర్‌కు వర్తించదు. గృహ అవసరాల ఎల్పీజీ సిలిండర్ ధరల్లో ఎలాంటి మార్పు లేదు.

తాజా సవరణతో దేశ రాజధాని ఢిల్లీలో 19 కిలోల వాణిజ్య సిలిండర్ ధర రూ.111 పెరిగి రూ.1,691.50కి చేరుకుంది. ముంబైలో రూ.1,531.50 నుంచి రూ.1,642.5కు, కోల్‌కతాలో రూ.1,684 నుంచి రూ.1,795కి, చెన్నైలో రూ.1,739.50 నుంచి రూ.1,849.50కి పెరిగింది. అదే సమయంలో విమానాల్లో వాడే ఇంధనం ఏటీఎఫ్ ధర భారీగా తగ్గింది. ఢిల్లీలో జెట్ ఇంధనం కిలో లీటర్‌కు రూ.7,353 తగ్గింది.