సర్.. జైత్ పూర్ అభినందనీయం
21-07-2026 05:41 PM
వాంకిడి,(విజయక్రాంతి): సర్ ప్రక్రియను వందశాతం పూర్తి చేయడం అభినందనీయమని, ఆసిఫాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ శ్యామ్ నాయక్ అన్నారు. మంగళవారం వాంకిడి మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. జైత్ పూర్ గ్రామంలోని బూత్ లో సర్ వందశాతం పూర్తయిందని తెలిపారు. నియోజకవర్గంలో కార్యక్రమాన్ని సమర్థవంతంగా చేపడుతుందనడానికి ఈ గ్రామమే నిదర్శనమన్నారు. అనంతరం బిఎల్ఏ జాబురే తిరుపతిని సన్మానించారు.






