Breaking News

కొండగట్టు అంజన్నను దర్శించుకున్న దేవాదాయ శాఖ కమిషనర్

29-08-2026 | 10:53pm

కొడిమ్యాల,(విజయక్రాంతి): చొప్పదండి నియోజకవర్గంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కొండగట్టు ఆంజనేయ స్వామిని తెలంగాణ దేవాదాయ, ధర్మదాయ శాఖ డైరెక్టర్, కమిషనర్ ఎం. హనుమంతరావు ఐఏఎస్ శనివారం దర్శించుకున్నారు. కమిషనర్‌కు ఆలయ అధికారులు,అర్చక స్వాములు సాదర స్వాగతం పలికారు. అనంతరం కమిషనర్ స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శనానంతరం వేద పండితులు కమిషనర్‌కు శేష వస్త్రం కప్పి ఘనంగా సత్కరించారు. ఆలయ అధికారులు ఆయనకు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో దేవస్థాన అధికారులు,ప్రధాన అర్చకులు,ఆలయ సిబ్బంది,తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు