11 May, 2026 | 1:32 AM

అమ్మవారి ఆలయంలో కమిషనర్ పూజలు

11-05-2026 12:00 AM

భైంసా (విజయక్రాంతి) నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో దేవదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు, జిల్లా కలెక్టర్ భవే ష్ మిశ్రా ఆదివారం సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. బాసర ఆలయానికి వచ్చిన కమిషనర్ కు జిల్లా కలెక్టర్ పుష్పగుచ్చం అందించి స్వాగతం పలికారు. అమ్మవారి ఆలయంలో పూజలు నిర్వహించి వేద పండితుల ఆశీర్వాదాలు తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ సాంకేత్ కుమార్ ఆలయ అధికారులు ఉన్నారు