తెలంగాణ జనసమితి రాష్ట్ర ప్లీనరీ విజయవంతం చేయండి
నిర్మల్ మే 10 (విజయ క్రాంతి)ఈ నెల 12 వ తేదీన రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో జల విహార్ లో నిర్వహించే తెలంగాణ జన సమితి 4 వ ప్లినరీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలనీ నిర్వాకులు తిలక్ రావు విజయ్ కుమార్ పిలుపునిచ్చారు. ఆదివారం నిర్మల్ జిల్లా కేంద్రంలో ప్లీనరీ నిర్వహణపై జిల్లా కమిటీ సమావేశం నిర్వహించారు.సాధించిన తెలంగాణ లో అమ రుల ఆకాంక్ష లు...అన్ని వర్గాలకు సంక్షేమ ఫలాలు అందాలని ఉదేశ్యంతోతెలంగాణ జన సమితి పార్టీని 2018 లో పార్టీని ఆవిష్కరించడం జరిగింది అన్నారు.
గత రెండు సంవత్సరాల కాలంలో పార్టీ నిర్మల్ జిల్లా వ్యాప్తంగా పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చిన అన్ని పార్టీ కార్యక్రమలని విజయవంతం చేసారు.ఈ కార్యక్రమం లో జిల్లా అధ్యక్షులు కడపత్రి తిలక్ రావు.. ముధోల్ ఇంచార్జి సర్దార్ వినోద్ కుమార్... విద్యార్ధి విభాగం రాష్ట్ర కార్యదర్శి దిలీప్.... జిల్లా కార్యదర్శి చిట్ల మల్ల రెడ్డి...యాత్ జిల్లా నాయకులు రాజకుమార్., వాజిద్ అహ్మద్ ఖాన్ , భాస్కర్ మరియు మైనారిటీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.






