ఉపాధి కూలీలకు యాప్ తిప్పలు!
- రెండు పూటలా కూలీల ఫొటోస్ స్కానింగ్
- లేక యాప్ లో అప్లోడ్ కానీ ఫోటోలు
- పని చేసినా హాజరు నమోదుకాక ఇబ్బందులు
వాంకిడి, మే 10 (విజయక్రాంతి): ఈజీఎస్ పనుల్లో నేషనల్ మొబైల్ మానిటరింగ్ సిస్టం యాప్ ద్వారా కూలీల హాజరు నమోదు ప్రక్రియ కేంద్రం అమలు చేస్తుంది. అయితే ఈ విధానం కూలీలకు తలనొప్పిగా మారింది. సాంకేతిక సమస్యలతో తీవ్ర ఇబ్బందులను తెచ్చిపెడుతోం ది. కూలీలు చేసే పని ప్రదేశంలో ఇంటర్నెట్, సర్వ సమస్యలతో ఫోన్లో ఫోటో స్కాన్ కావడం లేదు. దీంతో కూలీల హాజరు నమోదుగాక వారు వేతనాలు కూలిపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.
ఫొటోస్ కాం కోసం కూలీలు గంటల తరబడి ఎదురు చూడాల్సిన దుస్థితి నెలకొంది. రోజంతా పనిచేసినప్పటికీ యాప్ లో ఫోటో అప్లోడ్ కాకపోవడంతో హాజరు నమోదు కావడంతో దీంతో కూలీలు నిరాశతో ఇంటి బాట పడుతున్నారు. పని లేని పేదలకు ఏడాదిలో కనీసం వంద రోజులపాటు పని కల్పించాలని ఉద్దేశంతో మాత్మ గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎంజీఎన్‌ఆర్‌ఈజీఎస్) చట్టాన్ని 2006 లో అప్పటి కేంద్ర ప్రభుత్వం తీసుకొ చ్చింది.
అయితే, తాజాగా ఈ పథకం పేరును ’జీ రామ్ జీ’గా ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం మార్చింది. దాంతోపాటు ఈ చట్టంలోని సరికొత్త మార్పులను కూడా తెచ్చింది. పని ప్రదేశంలో ఉదయం ఒకసారి పని పూర్తయిన తర్వాత అక్కడే మరోసారి కూలీల ఫోటోలను లింక్ యాప్ లో ఫీల్ అసిస్టెంట్లు అప్లోడ్ చేయాలనే విధానాన్ని తీసుకొచ్చింది. ఈ నూతన యాప్ కారణంగా ఫీల్ అసిస్టెంట్లు నిర్దేశించిన మేరకు పన్నులను చేయించలేక కూలీల ఫోటోలు తీసి అప్ లోడ్ చేయడానికే పరిమిత అవుతున్నారు. దీంతో అసలు ఈ పథకం ఉద్దేశం పూర్తిగా నీరుగారుతొందనే కూలీల నుండి విమర్శలు వెల్లు వెత్తున్నాయి. ప్రభుత్వం విధించిన నిబంధన ప్రకారం కూలీల ఫోటోలు ఉదయం, సాయంత్రం కలిపి రెండు పూటలా యాప్ లో ఫోటోలు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది.
అయితే, గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్నెట్ సమస్యల కారణంగా ఫోటోలు అప్ లోడ్ కాకపోవడంతో కూలీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో రోజంతా కష్టపడి పని చేసిన యాప్ లో ఫోటో అప్లోడ్ కాకపోవడంతో వారి హాజరు నమోదు కావడం లేదని విమర్శలు ఉన్నాయి. దీంతో కూలీ పనిని ఎలా లెక్కిస్తారని, ఆ మేరకు నగదును తమ ఖాతాలో ఎలా జమ చేస్తారని కూలీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సదరు యాప్ లో సదరు కూలి ఫోటో విజయవంతంగా అప్లోడ్ అయితేనే హాజరు నమోదు అయినట్లుగా ఫీల్ అసిస్టెంట్ చెప్తున్నాడని కూలీలు అంటున్నారు. అనేకమంది ఈ ప్రక్రియలో ఇబ్బందులు తలెత్తుతున్నాయని వాపోతున్నారు.






