మొయినాబాద్ పీఎస్‌ను తనిఖీ చేసిన కమిషనర్ తరుణ్ జోషి
25-07-2026 01:40 AM
మొయినాబాద్, జులై 24 (విజయక్రాంతి): ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనర్ డా. తరుణ్ జోషి, ఐపీఎస్ శుక్రవారం మొయినాబాద్ పోలీస్ స్టేషన్ను తనిఖీ చేశారు. స్టేషన్లోని రికార్డులను పరిశీలించిన ఆయన, పెండింగ్ కేసులు మరియు తీవ్రమైన అన్డిటెక్టెడ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.
సైబర్ నేరాలపై అవగాహన పెంపొందించడం, విజిబుల్ పోలీసింగ్ పెంచడం, రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవడంతో పాటు దర్యాప్తులో సీసీటీన్స్, ఈ-సాక్షి వంటి ఆధునిక సాంకేతికతను వినియోగించాలని సూచించారు. అనంతరం స్థానిక పెట్రోల్ బంక్ను తనిఖీ చేసి, పోలీస్ స్టేషన్ ఆవరణలో మొక్క నాటారు. ఈ కార్యక్రమంలో డీసీపీ యోగేష్ గౌతమ్, ఏసీపీ బి. కిషన్, ఎస్హెచ్‌ఓ మల్లికార్జున రెడ్డి తదితరులు పాల్గొన్నారు.






