స్పష్టత వచ్చేదాకా దీక్ష ఆగదు..
25-07-2026 01:41 AM
కబ్జా భూములపై ప్రవీణ్ పట్టు
ఇబ్రహీంపట్నం, జులై 24(విజయక్రాంతి): యాచారం మండలం మొండిగౌరెల్లి గ్రామంలో ఆక్రమణకు గురైన భూములపై స్పష్టత వచ్చే వరకు తమ నిరాహార దీక్షను విరమించేది లేదని తెలంగాణ రాష్ట్ర భూముల పరిరక్షణ సమితి అధ్యక్షుడు గోడుకొండ్ల ప్రవీణ్ స్పష్టం చేశారు.
నాల్గవ రోజుకు చేరిన ఈ దీక్షా శిబిరాన్ని తహసీల్దార్ అయ్యప్ప సందర్శించి, రైతులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. తన పరిధిలోని సమస్యలను పరిష్కరిస్తానని, కబ్జా భూముల పరిహారం అంశం కలెక్టర్ పరిధిలో ఉన్నందున వారి దృష్టికి తీసుకెళ్తానని వెల్లడించారు. అయితే, స్పష్టమైన పరిహారం మరియు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగుతుందని ప్రవీణ్ తేల్చిచెప్పారు.






