25 July, 2026 | 2:54 AM

పాఠశాల నిర్మాణానికి కట్టుబడి ఉన్నా

25-07-2026 02:21 AM

మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి

బిజినేపల్లి, జూలై 24: మండలంలోని పాలెం గ్రామానికి చెందిన జెడ్పీహెచ్‌ఎస్ పాఠశాల నిర్మాణం కోసం కట్టుబడి ఉన్నానని, సుబ్బయ్య కుటుంబంతో చర్చించి తన ట్రస్టు తరుపున ఆ వివాదాస్పద స్థలానికి కొంత నష్ట పరిహారం చెల్లించడానికి సిద్ధంగా ఉన్నట్లు మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి తెలిపారు.

సుబ్బయ్య కుటుంబ సభ్యులతో త్వరగా చర్చించి సానుకూల నిర్ణయం తీసుకోవాలని మాజీ ఎంపీపీ శ్రీనివాసుగౌడుకు మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి శుక్రవారం ఫోనులో సూచించారు. పాఠశాల స్థల వివాదం ఇప్పటికిప్పుడు పరిష్కారం అయితే తన ట్రస్టు తరుపున అధునాతన హంగులతో, సౌకర్యాలతో పాఠశాల నిర్మాణ పనులు మొదలు పెడుతానని తెలిపారు.