25 July, 2026 | 3:10 AM

కేటీఆర్ జన్మదిన వేడుకలు

25-07-2026 02:22 AM

బుద్వేల్ ఆసుపత్రిలో పండ్ల పంపిణీ

హైదరాబాద్, జూలై 24 (విజయక్రాంతి): బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ 50వ జన్మదినాన్ని పురస్కరించుకుని బుద్వేల్ ప్రభుత్వ ఆసుపత్రిలో శుక్రవారం రోగులకు బీఆర్‌ఎస్ నాయకులు పోరెడ్డి ధర్మారెడ్డి, ఎ ర్రోళ్ల యాదయ్య ఆధ్వర్యంలో పండ్ల పంపిణీ నిర్వహించారు. నాయకులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధనలో కేసీఆర్ నాయకత్వంలో కీలక పాత్ర పోషించిన కేటీఆర్, రాష్ట్ర పునర్నిర్మాణంలోనూ తనదైన ముద్ర వేశారని పేర్కొన్నారు.

ఐటీ, పరిశ్రమలు, మున్సి పల్ శాఖ మంత్రిగా పనిచేసిన సమయంలో తెలంగాణను ప్రపంచ పెట్టుబడుల గమ్యస్థా నంగా నిలిపారని కొనియా డారు. కార్యక్రమంలో సరి కొండ దుర్గేష్, వీర్లపల్లి నవీన్ కుమార్, బండ్ల నరేందర్, గిరిబాబు, ప్రవీణ్, నాగేష్, యాదగిరి, రాజు, వెంకటేష్ గౌడ్, నిష్కల్ రెడ్డి, విజయ్, హనుమాన్ జీ, అకిరా నందన్, సునీల్ గౌడ్, ఎల్లయ్య, రాజిరెడ్డి, నీరజ్, సతీష్, అనుదీప్ రెడ్డి, నవదీప్, రవికిరణ్, బాలు, ప్రదీప్, ప్రవీణ్ రాజ్, శివ పాల్గొన్నారు.