ల్యాండ్‌బ్యాంక్ గుర్తింపునకు కమిటీ
14-06-2024 12:15 AM
ప్రకటించిన ప్రభుత్వం
హైదరాబాద్, జూన్ 13 (విజయక్రాంతి): అటవీ పెంపకానికి ల్యాండ్ బ్యాంక్ గుర్తించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఒక కమిటీని నియమిం చింది. ఈ మేరకు గురువారం ఉత్తర్వు లు జారీ చేసింది. కమిటీ చైర్మన్‌గా ప్రిన్సిఫల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ వ్యవహరించనున్నారు. సభ్యులుగా సీసీఎల్‌ఏ అధికారి, పర్యావరణ అట వీశాఖ అధికారి, డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ అధికారులు ఉంటారు. ఈ కమిటీ వివిధ వర్గాల అటవీయేతర భూములు సేకరించి అడవుల పెంప కానికి తీసుకోవాల్సిన చర్యలతో పాటు అంతరించిపోతున్న జంతువు లు కాపాడటం తదితర అంశాలపై ప్రతిపాదనలు సిద్ధం చేయనుంది.






