లాసెట్ ఫలితాలు విడుదల
72.66 శాతం మంది ఉత్తీర్ణత
వెల్లడించిన ఉన్నత విద్యా మండలి చైర్మన్ లింబాద్రి
హైదరాబాద్, జూన్ 13 (విజయక్రాంతి): టీజీ లాసెట్, పీజీఎల్ సెట్ ఫలితా లు గురువారం విడుదలయ్యాయి. మాసాబ్ ట్యాంక్‌లోని తెలంగాణ ఉన్నత విద్యామండలి కార్యాలయంలో చైర్మన్ ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి, వైస్ చైర్మన్లు ప్రొఫెసర్ వెంకటరమణ, ప్రొఫెసర్ ఎస్‌కే మహమూద్, సెక్రటరీ శ్రీరాం వెంకటేశ్, కన్వీనర్ ప్రొఫెసర్ విజయలక్ష్మీ కలిసి ఫలితాలను విడుదల చేశారు. మొత్తం 50,684 మంది దరఖాస్తు చేసుకో గా, 40,268 మంది పరీక్ష రాశారు. ఇందు లో 29,258 (72.66 శాతం)మంది ఉత్తీర్ణత సాధించారు. వీరిలో 20,237 (75.30 శాతం) మంది అబ్బాయిలు, 9017 (67.35 శాతం) అమ్మాయిలు, నలుగురు ట్రాన్స్‌జెండర్లు ఉన్నారు. మూడేళ్ల ఎల్‌ఎల్‌బీ కోర్సుకు 27,993 మందికిగానూ 20,510 (73.27 శాతం) మంది అర్హత సాధించారు. ఐదేళ్ల కోర్సుకు 8412 మంది హాజరైతే 5478 (65.12 శాతం) ఉత్తీర్ణులయ్యారు. రెండేళ్ల ఎల్‌ఎల్‌ఎం ప్రవేశ పరీక్షకు 3863 మంది హాజరైతే 3270 (84.65 శాతం) మంది అభ్యర్థులు పాసయ్యారు.
డాక్టర్లు పోటీ
న్యాయ విద్యను అభ్యసించేందుకు వైద్యు లు సైతం పోటీ పడుతున్నారు. మూడేళ్ల ఎల్‌ఎల్‌బీ కోర్సుకు ఎంబీబీఎస్ వైద్యులు 109 మంది దరఖాస్తు చేసుకోగా, అందులో 72 మంది పరీక్షకు హజరైతే, వారిలో 68 మంది పాసయ్యారు. న్యాయవిద్యకు కొంత కాలంగా ఫుల్ డిమాండ్ ఉండడంతో డిగ్రీ చేసేవారితోపాటు వైద్యులు ఆసక్తి చూపిస్తున్నారు.
అత్యధికంగా బీకామ్ విద్యార్థులే...
లాసెట్ (మూడేళ్ల కోర్సు) పరీక్ష రాసినవారిలో అత్యధికంగా బీకామ్ విద్యార్థులే ఉన్నారు. 11,316 మంది దరఖాస్తు చేసుకో గా, వీరిలో 8918 మంది పరీక్షకు హాజరుకాగా 5790 మంది ఉత్తీర్ణులయ్యారు. తర్వా త బీఎస్సీ వారు 8551 మంది దరఖాస్తు చేసుకోగా, వీరిలో 6628 మంది పరీక్షకు హాజరైతే వారిలో 5068 మంది పాసయ్యా రు. ఆతర్వాత బీఏ, బీటెక్ విద్యార్థులున్నారు.
ర్యాంకర్లు వీరే..
మూడేళ్ల లాకోర్సులో టాప్ 5 ర్యాంకుల్లో ఐదో ర్యాంకు అతను ఏపీకి చెందిన విద్యార్థి కాగా మిగతా వారు తెలంగాణ విద్యార్థులే ఉన్నారు. మొదటి ర్యాంకు హైదరాబాద్‌కు చెందిన పీజీఎం అంబేద్కర్, రెండో ర్యాంకు ను రంగారెడ్డి జిల్లాకు చెందిన పత్యూష్ సరస, మూడో ర్యాంకును ఖమ్మం జిల్లాకు చెందిన తాల్లూరి నరేష్, నాల్గో ర్యాంకును సిద్ధిపేటకు చెందిన సీతా వెంకటేశ్, ఐదో ర్యాంకును ఏపీ విద్యార్థి సాధించారు. ఐదేళ్ల లాకోర్సులో అందరూ తెలంగాణ విద్యార్థు లే ఉండగా, పీజీఎల్‌సెట్ (ఎల్‌ఎల్‌ఎం)లో టాప్ 5 ర్యాంకుల్లో ఇద్దరు ఏపీవారు, ముగ్గురు తెలంగాణ విద్యార్థులు ఉన్నారు.
30 కాలేజీలు, 8180 సీట్లు
రాష్ట్రంలో మొత్తం 30 కాలేజీలుండ గా, వీటిలో 8 ప్రభుత్వ, 22 ప్రైవేట్ కాలేజీలున్నా యి. వీటిలో మొత్తం 8180 సీట్లు అందుబాటులో ఉన్నాయి. డిసెంబర్‌లోనే కళాశాలల్లో ఇన్‌స్పెక్షన్ చేపట్టి, గుర్తింపు ప్రక్రియను పూర్తి చేసి బార్ కౌన్సెలింగ్‌కు వివరాలు పంపించినట్లు తెలిపా రు. మూడేళ్ల లా కోర్సులో 4910 సీట్లు, ఐదేళ్ల కోర్సులో 2,280 సీట్లు, రెండేళ్ల కోర్సులో 990 సీట్లు అందుబాటులో ఉన్నట్లు ఆయన వెల్లడించారు.
ఆర్ లింబాద్రి, తెలంగాణ
ఉన్నత విద్యామండలి చైర్మన్






