28 June, 2026 | 1:20 PM

ఒకటో తరగతిలో అడ్మిషన్లు పొందినవారు 24 వేల మంది

14-06-2024 12:14 AM

హైదరాబాద్, జూన్ 13 (విజయ క్రాంతి): జూన్ 12 నుంచి పాఠశాలలు పునఃప్రారంభమవడంతో విద్యార్థులంతా బడిబాట పడుతున్నారు. ఈక్రమంలోనే ఈనెల 12, 13 తేదీల్లో మొత్తం 24,082 మంది విద్యార్థులు ఒకటో తరగతిలో అడ్మిషన్లు పొందా రు. తొలి రోజు ఒకటో తరగతిలో 10,577 మంది విద్యార్థులు ప్రవేశా లు పొందినట్టు విద్యాశాఖ వెల్లడించిం ది. ఇప్పటివరకు మొత్తం 12,05,065 మంది విద్యార్థులకు యూనిఫాంలను పంపిణీ చేసినట్టు సమగ్రశిక్ష ప్రాజెక్టు డైరెక్టర్ మల్లయ్య భట్టు తెలిపారు. 12,52,041 మంది విద్యార్థులకు నోటు పుస్తకాలు, 17,14,012 మందికి పాఠ్యపుస్తకాలను పంపిణీ చేసినట్టు వివరించారు. 2,33,613 మంది విద్యార్థులకు వర్క్‌బుక్స్ ఇచ్చినట్టు తెలిపా రు. పలు జిల్లాల్లో బడిబాట కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారు లు పాల్గొన్నట్టు వెల్లడించారు. ఈసారి ఒకటో తరగతిలో అడ్మిషన్లు తక్కువగా వచ్చినట్టు తెలుస్తోంది.