యువతే టీఆర్పీకి బలం
- పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి
- పార్టీ అధినేత, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న
- యువజన విభాగం జనరల్ సెక్రటరీగా పోలు రాజు నియామకం
హైదరాబాద్, ఏప్రిల్ 10(విజయక్రాంతి): తెలంగాణ రాజ్యాధికార పార్టీ యువజన విభాగాన్ని మరింత బలోపేతం చేస్తూ టీఆ ర్పీ అధినేత, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కీలక నిర్ణయం తీసుకున్నారు. పోలు రాజును రాష్ట్ర యువజన విభాగం జనరల్ సెక్రటరీగా తీన్మార్ మల్లన్న నియమించారు. శుక్ర వారం హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో పోలు రాజుకి నియామక పత్రా న్ని పార్టీ అధినేత తీన్మార్ మల్లన్న అందజేశారు.
ఈ సందర్భంగా మల్లన్న మాట్లాడు తూ పార్టీ అభివృద్ధి కోసం పోలు రాజు చేస్తున్న అకుంఠిత కృషిని గుర్తించి రాష్ట్ర నాయకత్వం ఈ బాధ్యతలు అప్పగించింది అన్నారు. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు యువజన విభాగాన్ని బలోపేతం చేసి, పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి. యువతే పార్టీకి నిజమైన బలం. వారి శక్తిని సమర్థవంతంగా వినియోగించుకోవాల్సిన అవసరం ఉంది అని స్పష్టం చేశారు.
పోలు రాజు స్పందిస్తూ, నాపై ఉంచిన నమ్మకానికి కృతజ్ఞతలు. అప్పగించిన బాధ్యత లను పూర్తి నిబద్ధతతో నిర్వహిస్తూ, యువజన విభాగాన్ని మరింత శక్తివంతంగా, సం ఘటితంగా మలచి పార్టీ విజయానికి అన్ని రకాలుగా కృషి చేస్తాను అని హామీ ఇచ్చా రు. ఈ కార్యక్రమంలో పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, యువజన విభాగ సభ్యు లు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.




