ముగ్గురు అధికారులతో పీఆర్సీపై కమిటీ
29-04-2026 02:25 AM
హైదరాబాద్, ఏప్రిల్ 28 (విజయక్రాంతి): ఆర్టీసీ ఉద్యోగులకు సంబంధించిన పీఆర్సీపై ప్రభుత్వం ఒక కమిటీని నియమించింది. ముగ్గురు అధికారులతో ఈ కమిటీని వేసినట్లు ఆర్టీసీ పేర్కొంది. ఈ కమిటీలో డిప్యూటీ సీఏవో కే.గీత, డిప్యూటీ సీటీఎం సమీరా అఫ్రీన్, డిప్యూటీ సీపీఎం వై.శిరీష ఉన్నారు. ఆర్టీసీ కార్మికులకు సంబంధించిన పేస్కేల్‌కు సంబంధించి ఓ నివేదికను రూ పొందించి మే 10వ తేదీ వరకు ఇవ్వాలని పేర్కొంది. ఆర్టీసీ సమ్మె నేపథ్యలో 11 శాతం ఫిట్‌మెంట్‌తో పీఆర్సీని ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే.






